Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సులు ,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలి.

*ప్రభుత్వ హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సులు ,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలి.*

 *ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పించాలి.* 

*ప్రభుత్వ ప్రాథమిక ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి.* 

 *ప్రవేట్ కార్పరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి.* 

*పేషంట్లను ప్రవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే పీఆర్ఓ సిస్టoను అరికట్టాలి.* 

ప్రవేట్ డయోగ్రానస్టిక్ సెంటర్ లపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి.* 

*టెస్టులు మందుల పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి.* 

*POW,PYL భద్రాచలం డివిజన్ కమిటీలు.* 

*పోస్టర్ ఆవిష్కరణ* 

*మునిగేలా మహేశ్వరి pow డివిజన్ అధ్యక్షురాలు.* 

భద్రాచలం. 

 

భద్రాచలం పట్టణంలో ఈరోజు పిఓడబ్ల్యూ పి వై ఎల్ సంఘాల వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా POW జిల్లా కార్యదర్శి కెచ్చల కల్పన భద్రాచలం డివిజన్ అధ్యక్షురాలు మునిగేలా మహేశ్వరి మాట్లాడుతూ.

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆస్పత్రిలో పనిచేసే ఆయాలకు కాంట్రాక్ట్ వర్కర్లకు సకాలంలో జీతాలు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు అన్నారు. పేదవారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు సరిగా లేకపోవడం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పేదవారు ప్రభుత్వ ఆసుపత్రి పై ఆధారపడి ఉంటారని వీరికి వైద్యం సకాలంలో అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ మరియు మందులు సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ హాస్పటల్ని ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీ తో వైద్య సేవలు అందించాలని వారు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ లకు,నర్సులకి రక్షణ కల్పించి. ప్రభుత్వ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయాలని వారు అన్నారు. 

ప్రవేట్ ఆసుపత్రులలో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఏజెన్సీ లో ఉన్న ప్రజల్ని ఆర్థిక ఇబ్బందులు పెడుతున్న ప్రైవేట్ హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులకు కొమ్ము కాస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలోకి రిఫర్ చేస్తూ ఆర్థిక సంబంధాలు పెట్టుకొని ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వైద్యుల్ని గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. ప్రవేట్ ఆసుపత్రులకు ప్రజలు వెళ్ళినప్పుడు టెస్టులు మందుల పేర్లతో ఇస్తారాజ్యంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని. టెస్టులు ధరల చూచి ని బోడ్లపై ప్రకటించాలని వారు అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలని ప్రవేట్ మెడికల్ మాఫీ అని అరికట్టాలని వారి అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో. దాసరి సాయన్న, కుమారి, ఎస్.కె మైమదా, కృష్ణవేణి, షకీరా ,శాంత, పిరుదోజి, తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

ప్రోగ్రెసివ్ యూత్ లిగ్ (PYL) భద్రాచలం కమిటీ

ప్రగతిశీల మహిళా సంఘం (POW ) భద్రాచలం డివిజన్ కమిటీ.

Exit mobile version