సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 27న జరగనున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది అన్నారు. కావున ఉద్యోగులు 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ క్రాంతి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 27న సెలవు
Published On: February 21, 2025 8:28 pm
