చందాపూర్, సంగోజీవాడి గ్రామాల్లో పశువులకు టీకాలు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 23
తాడ్వాయి మండల పరిధిలోని చందాపూర్ మరియు సంగోజీవాడి గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 108 ఆవులకు, 389 గేదెలకు టీకాలు వేశారు.
పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. రమేష్, వీఎల్ఓ పోచయ్య, జేవిఓ,లు కొండల్ రెడ్డి, ప్రేమ్ సింగ్, అలాగే గోపాలమిత్రలు, పాల్గొన్నారు.
గ్రామాల్లో పశువుల ఆరోగ్యం, ఉత్పాదకత పెంపు దిశగా ఇలాంటి టీకా కార్యక్రమాలు, కొనసాగుతాయని పశువైద్యాధికారి తెలిపారు.