కన్కల్‌ గ్రామంలో పశువులకు టీకాలు 

కన్కల్‌ గ్రామంలో పశువులకు టీకాలు

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి, (ప్రశ్నఆయుధం) అక్టోబర్ 17

 

 

తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో శుక్రవారం రోజున పశువుల ఆరోగ్య రక్షణ కోసం భారీ స్థాయిలో టీకా, కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పశువులపై వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మొత్తం 223 ఆవులకు, 249 గేదెలకు, టీకాలు వేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. రమేష్ పర్యవేక్షణలో టీకాలు వేయగా, డైరీ ప్రెసిడెంట్ గడ్డం కిష్టారెడ్డి, పోచయ్య (VLO), కొండల్ రెడ్డి (JVO), ప్రేమ్ సింగ్ (JVO),పాల్గొన్నారు. అలాగే గ్రామంలోని గోపాలమిత్రలు సైతం చురుకుగా సహకరించారు.

 

పశువులకు సమయానికి టీకాలు వేయడం వల్ల వ్యాధుల ప్రబలత తగ్గి, పాల ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామ రైతులు ఈ చర్యకు సంతోషం వ్యక్తం చేస్తూ, పశువైద్యశాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment