నందివాడలో పశువులకు గాలికుంటూ టీకాలు
— ఆవులు, గేదెలకు వ్యాధినిరోధక టీకాలు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 27
సోమవారం రోజున తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో పశువులకు గాలికుంటూ టీకాలు వేయడం జరిగింది. మొత్తం 98 ఆవులకు, 203 గేదెలకు వ్యాధినిరోధక టీకాలు వేశారు.
ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. రమేష్ పర్యవేక్షణలో టీకాలు వేశారు. కార్యక్రమంలో పోచయ్య (VLO), కొండల్ రెడ్డి (JVO), ప్రేమ్ సింగ్ (JVO), గోపాలమిత్రలు, పాల్గొన్నారు.
పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ టీకా కార్యక్రమం, ప్రతి గ్రామంలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.