రాజ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం మే02: కూకట్‌పల్లి ప్రతినిధి
జనతా పార్టీ బాలానగర్ డివిజన్ పోలింగ్ బూత్ అధ్యక్షులు రాజ్ కుమార్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచారు, స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు రాజ్ కుమార్ స్వగృహానికి విచ్చేసి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, అనంతరం వారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించి తదుపరి కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు, అందరిని తన చిరునవ్వుతో పలకరించే రాజ్ కుమార్ ముక్కు సూటిగా మాట్లాడుతూ, ఈరోజు మన మధ్య లేడు అనే విషయం చాలా బాధ కలిగిస్తుందని, ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను అని చింతిస్తూ, అధైర్య పడవద్దు అని కుటుంబానికి అండగా నేనున్నానని రాజేశ్వరరావు భరోసా ఇచ్చారు.