గాంధీనగర్ శివాలయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు దొంగతనము
దుండగులను శిక్షించలని కోరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం మార్చి11: కూకట్‌పల్లి ప్రతినిధి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ శివాలయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడుతూ అక్కడ చేసినటువంటి దుశ్చర్యకు వ్యతిరేకంగా వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించలని శాంతియుతంగా హిందూ సంఘాలు మరియు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలుపడానికి వెళ్తే వారిని నిర్మానుషంగా అరెస్టు చేసి కూకట్ పల్లీ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది, స్థానిక నాయకుల ద్వారా విషయం తెలిసిన వెంటనే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హిందూ బంధువులను, భాజపా నాయకులను, కార్యకర్తలను పరామర్శించి సంఘీభావం తెలిపారు ,ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరువృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ, లేదంటే అందరం కలిసి న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు తెలియజేశారు.