డ్రీమ్ కార్డెల్స్ (కలల ఉయ్యాల) స్టూడియోను ప్రారంభించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
డ్రీమ్ కార్డెల్స్ (కలల ఉయ్యాల) స్టూడియోను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కెపిహెచ్బి డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు వరలక్ష్మి & శంకర్ దంపతులు ఆహ్వానం మేరకు వారి కుమారుడు సాయి తెల్లాపూర్ లో ఏర్పాటుచేసిన డ్రీమ్ కార్డెల్స్ (కలల ఉయల) స్టూడియో ప్రారంభోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, వారి కరకమలములచే స్టూడియోను ప్రారంభించారు, నేటి యువత ఉద్యోగ అవకాశాల కోసం కాలయాపన చేయకుండా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని, సాయి చేసినటువంటి ఈ ప్రయత్నం ఫలించాలని భవిష్యత్తులో మంచి ఫలితాలు పొంది తన కలలను నిజం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వడ్డేపల్లి రాజేశ్వరరావు సాయిని అభినందించి ఆశీర్వదించారు, అనంతరం తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వరలక్ష్మి & శంకర్ దంపతులు ఘనంగా సన్మానించి సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో కెపిహెచ్బి కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి, డివిజన్ నాయకులు సులోచన, శ్రీహరి, మహేందర్, పావని,ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.