రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 31: కూకట్‌పల్లి ప్రతినిధి
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్న తల్లి పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని కూకట్ పల్లి పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి కార్యక్రమంలో పాల్గొనకుండా నిర్బంధించారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, కానీ పోలీసుల దుర్వినియోగం వల్ల ప్రజాస్వామ్య హక్కులను నొక్కిపెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రధాని కుటుంబాన్ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించినట్టే అవుతుందని, అలాంటి అసభ్యకర వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.