వైశ్యులు సేవల్లో ముందుంటారు : ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

వైశ్యులు సేవల్లో ముందుంటారు

–  ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా

గజ్వేల్ నియోజకవర్గం, 10 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దావఖాన వద్ద సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గోలి వెంకటేశం, కీర్తిశేషులు తోట భూమలింగం, కీర్తిశేషులు ఆదిమూలం రాములు జ్ఞాపకార్థం ఫ్రీజర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ వైశ్య నాయకులు తోట బిక్షపతి, గోలి సంతోష్, ఆదిమూలం నారాయణ సౌజన్యంతో ఫ్రీజర్ అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు సేవానిరతి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంగునూరి సత్యనారాయణ, కొడిప్యాక నారాయణ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు ఎన్ సీ సంతోష్, కైలాస ప్రభాకర్, అత్తెల్లి కిషన్, ఉత్తనూరి సంపత్, దొంతుల సత్యనారాయణ, బ్రాహ్మణపల్లి బిక్షపతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now