గర్గుల్ పాఠశాలలో  వన మహోత్సవం

గర్గుల్ పాఠశాలలో  వన మహోత్సవం

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం) జూలై 18

 

కామారెడ్డి మండలంలోని గర్గుల్ పాఠశాలలో  అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణకై మొక్కల పెంపకం కోసం విద్యార్థులు చేసే రక్షణ పై వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ విద్యార్థులకు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ అధికారి (సిసిఎస్) ఈలు సింగ్, జిల్లా డీఎఫ్ఓ నిఖిత, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, మండల విద్యాధికారి (ప్రధానోపాధ్యాయులు) ఎల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిఆర్పి రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now