*పర్యావరణ పోషకులు వనజీవి రామయ్య సేవలు చిరస్మరణీయం*
*శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో వనజీవి రామయ్య సంతాప సభ*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 13 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

పోషకులు కోటి మొక్కలు నాటిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రకృతి మాతకు చేసిన సేవలు చరస్మరణీయమని బౌద్ధం అభిమాని అంగోత్ మంగీలాల్ అన్నారు, ఆదివారం మధ్యాహ్నం మణుగూరు సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సిబ్బందితో కలిసి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వనజీవి రామయ్య మృతి వార్త పర్యావరణ ప్రేమికులను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నారు మొక్కలపై ఆయనకున్న అమితమైన ప్రేమ ఇంటిపేరు వన జీవి రామయ్య గా గుర్తింపు పొందారని ఆరవ తరగతి పాఠ్యాంశం లో కూడా ఆయన జీవిత చరిత్రను చేర్చారని పచ్చదనం కోసం పాటుపడిన వట వృక్షం నేడు నేలకొరిగిందని మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడడమే రామయ్య గారికి మనవిచ్చే ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సుహాసిని దేవి,స్వాతి , లింగంపల్లి రాధా, భూమి, గణేష్, పావని, అమిత, కోశయ్య, రామయ్య, అంజలి, శ్రీదేవి, రాకేష్, భీమ తదితరులు పాల్గొన్నారు
Post Views: 7