*శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ పాచక వృత్తి లో పదవి విరమణ పొందిన వనమామలై లోకాచారి కి ఘన సత్కారం*
*దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు ధర్మకర్తలు*
*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 1 ప్రశ్న ఆయుధం*
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వానమామలై లోకాచార్యులు పాచక వృత్తిలో గత 25 సంవత్సరాలుగా సేవలందించి జూన్ 30తో పదవీకాలం ముగియడంతో పదవి విరమణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలి రామారావు ధర్మకర్తల సమక్షంలో నిర్వహించారు లోకాచార్యుల దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు దేవస్థానంలో నిర్వహించే అనేక కార్యక్రమాలకు దేవతామూర్తులకు సమర్పించే నైవేద్యాన్ని లోకాచార్యులు అందుబాటులో ఉండి అందించే వారిని వారి సేవలు మరువలేనివని కొనియాడారు పాచక వృత్తి ఎంతో భక్తిశ్రద్ధలతో చేయవలసి వస్తుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ ఆలయ అర్చకులు శేషం వంశీధరాచార్యులు మడికొండ నవీన్ శర్మలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ధర్మకర్తలు రవి కిరణ్ పరమేశ్వర్ శ్రీనివాస్ కిషన్ రెడ్డి రాజేందర్ చిరంజీవి మల్లేష్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి నారాయణరెడ్డి మధుకర్ రెడ్డి తిరుపతి రెడ్డి నాగరాజులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు