వందేమాతరం 150వ వసంతాలు

వందేమాతరం 150వ వసంతాలు

 కామారెడ్డిలో ఘనంగా గేయాలాపన

IDOC ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది సమూహంగా ఆలాపన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 7

భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత శ్రీ బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ అమర గీతం 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల భాగంగా కామారెడ్డి జిల్లాలో వందేమాతరం గేయాలాపన ఘనంగా జరిగింది.

శుక్రవారం ఉదయం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ (IDOC) ప్రాంగణంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందని, ప్రతి భారతీయుడిలో దేశప్రేమను మళ్లీ మేల్కొలిపే సందర్భమిదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సంస్థల్లోనూ ఉదయం ఒకేసారి వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడిందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment