సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): వందే మాతరం గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి దాయకమైన జాతీయ గీతం అని, భారతీయుల హృదయాల్లో దేశప్రేమను రగిలించే ఉద్యమ నినాదం – వందే మాతరం అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శుక్రవారం వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందితో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం పొడువున అనగా నవంబర్ 7 నుండి 7 నవంబర్ 2026 వరకు స్మారక కార్యక్రమాల ద్వారా వందేమాతరం 150-వసంతాల ఉత్సవాలను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10.00 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో కలిసి వందేమాతరం జాతీయ గీతం ఆలపించడం జరిగిందని అన్నారు. వందేమాతర గీతాన్ని బంకిమ్ చంద్ర చటర్జీ గారు 1875లో రాశారు. “వందే మాతరం” అంటే “మాతృభూమికి వందనం”, అని అర్థం. “వందే మాతరం” నినాదం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఒక స్ఫూర్తి నినాదంగా నిలిచిందని తెలిపారు. 1905లో బెంగాల్ విభజన సమయంలో ప్రజలు ఈ నినాదాన్ని పాడుతూ బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు చేశారని, బాల గంగాధర తిలక్, లాలా లజపతరాయ్, అరవిందఘోష్, బిపిన్ చంద్ర పాల్ వంటి నేతలు ఈ గీతాన్ని ప్రజల్లో తీసుకెళ్లారని అన్నారు. స్వాతంత్ర్య అనంతరం 24 జనవరి 1950లో భారత రాజ్యాంగ సభ “వందే మాతరం” ను జాతీయ గీతంగా గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావు, ఆర్ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, ఆఫీసు సూపరిడెంట్స్ అశోక్, మెహనప్ప, డీపీఓ సిబ్బంది తదితరులు ఉన్నారు.
వందే మాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైన జాతీయ గీతం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Oplus_16908288