వరసిద్ధి కాలనీ, శ్రీరామ కాలనీ, పార్వతి నగర్ సమస్యలు పరిష్కరించండి

వరసిద్ధి కాలనీ, శ్రీరామ కాలనీ, పార్వతి నగర్ సమస్యలు పరిష్కరించండి

IMG 20250726 WA0105మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు బిజెపి నాయకుడు మాసం గణేష్*

*కరీంనగర్ జూలై 26 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రస్తుత 39వ డివిజన్ లోని వరసిద్ధి కాలనీ, శ్రీరామ కాలనీ, పార్వతీ నగర్ లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం రోజున బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్ కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా ఆయా ప్రాంతాలకు కనీస రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు కూడా లేని దయనీయ పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా శ్రీరామ కాలనీలో కనీసం ట్యాప్ కనెక్షన్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత వానలతో ఇక్కడి ప్రాంతాల్లోని రహదారులన్నీ బురద మయంగా మారి , రాకపోకలు కొనసాగించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. వర్షపు నీరు రోడ్ల పైనే నిలవడం , లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు .ఇక్కడి ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలని మాసం గణేష్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు కాలనీల సమస్యలు పరిష్కరించాలని త్వరలో రోడ్ల నిర్మాణం చేపించి ప్రజలను ఆదుకోవాలని కోరారు

Join WhatsApp

Join Now