గోవింద నామస్మరణతో మార్మోగిన వర్గల్ క్షేత్రం

శ్రీ వెంకటేశ్వర క్షేత్రంలో…ముక్కోటి ఏకాదశి వైభవం

ఉత్తర ద్వారా దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు 

గోవింద నామస్మరణతో మార్మోగిన క్షేత్ర సముదాయం

సతీసమేతులైన శ్రీ స్వామివారికి శాస్త్రవేత్తంగా విశేష అభిషేకాలు 

ఘనంగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర కళ్యాణo 

గజ్వేల్ నియోజకవర్గం, 10 జనవరి 2024 :

ప్రసిద్ధ వర్గల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర క్షేత్రంలో వైకుంఠ ( ముక్కోటి ) ఏకాదశి వైభవం సంతరించుకుంది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల మంత్రోశ్చరణల మధ్య సతీసమేతులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, లక్ష తులసి అర్చన, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. కాగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో క్షేత్రానికి శుక్రవారం తెల్లవారు జామునుండే తరలిరావడం కనిపించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయగా, స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేయగా, ఆలయ సముదాయం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవ విజయవంతం కోసం ఏర్పాట్లు చేయగా, శ్రీ విద్యాధరి, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ శనీశ్వర, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర క్షేత్ర సముదాయంలో ధ్యాత్మిక వాతావరణo సంతరించుకుంది. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ నిర్వాహకులు యాయవరం రాజశేఖర శర్మ, దాచేపల్లి వెంకట కృష్ణారావు, బొమ్మిడాల సత్యనారాయణ, ఇర్రి మల్లారెడ్డి, గంగిశెట్టి సుధాకర్ గుప్త, వెంకట్రాంరెడ్డి, శ్రీరాం రంగయ్య, గంగా శ్రీనివాస్ గుప్త, దోసపాటి లక్ష్మణరావు, ఆలయ నిర్మాణ దాత, వాసు గ్రూప్స్ చైర్మన్ బెజుగామ శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment