లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ఆదివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకున్నారు. కుంకుమార్చనలు, వాహన పూజలు, బాసింగాలు, ఒడిబియాలు, పుట్టు వెంట్రుకలు గండ దీపాలు లతో పాటు ఇతర మొక్కుబడులు వివిధ జిల్లాలలో నుండి వచ్చి సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.