*శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు*
*
భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారికి వసంతోత్సవమును నిర్వహించారు ప్రధాన ఆలయంలో అద్దాల మండపం ప్రాంగణంలో దేవతామూర్తులకు ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు వంశీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజారి కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ దేవాలయం నుండి భాజా భజంత్రీలతో సన్నాయి నాదాలతో ప్రధాన ఆలయానికి చేరుకొని వసంతోత్సవం నిర్వహించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి మాసానికి ఒక ప్రత్యేక ఉంటుందని వాతావరణం లోని మార్పులకు అనుగుణంగా సంబరాలు జరుపుకోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు