బాసర శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతం పూజలు నిర్వహించిన ఆలయ అర్చక వైదిక సిబ్బంది

 

కార్తీక మాసం :వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన ఆలయ అర్చక వైదిక బృందం..

నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా అక్షరాభ్యాస మండపంలో మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు,వేద పండితులు. కని విని ఎరగని రీతిలో పుణ్య దంపతులచే నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం,అష్టలక్ష్మీ పూజాది క్రతువులు అశేష భక్తజనం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.పుణ్య దంపతులు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులతో పూజలో పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన,కలశ స్థాపన,గణపతి పూజ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం,నవ విధాభిషేకం, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, పంచలోకపాలన పూజలు, వేధమంత్రోచ్ఛరణాల మధ్య కన్నుల పండువగా జరిగింది.ఆలయ స్థానాచార్యులు.ప్రవీణ్ పాఠక్.ప్రధాన అర్చకులు. సంజీవ్ పూజారి,వేద పండితులు.నవీన్ శర్మ సత్యనారాయణ స్వామి వ్రత కథా ప్రవచనం కడు రమ్యంగా వ్రత కథలో ఉన్న నీగుడు రహస్యలను భక్తులకు విడమర్చి వివరించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ పాఠక్ మాట్లాడుతూ.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆ భగవంతుని సంకల్పమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తమ కుటుంబానికి మేలు జరుగుతుందని ఇటువంటి సామూహిక వ్రత కార్యక్రమం చేయడం వల్ల వారి కుటుంబాలతో పాటు అందరికి మంచి జరుగుతుందని అలానే ప్రజా శ్రేయస్సుకు లోక కళ్యాణ నిమిత్తం ఇటువంటి పుణ్య వ్రతాలు నిర్వహించడం భక్తుల అదృష్టమని అన్నారు.
ఈ సంకల్ప వ్రత కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొనగా ఆలయం తరపున తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదం వితరణ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment