సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల అనుసారంగా వీరబాల దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్న ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎందరో అమరవీరులకు జన్మనిచ్చినటువంటి దేశమని భారతదేశాన్ని పురాతన కాలం నుండి అనేక రాజవంశాలు పరిపాలించి సస్యశ్యామలంగా మార్చినాయని తరువాత కొన్ని కారణాలవల్ల ఈ దేశము విదేశీ దండయాత్రలకు గురికావడం జరిగిందని, విదేశీయులు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నము చేయాలని ప్రయత్నించిన అనేకమంది అమరవీరుల త్యాగాలపరితంగా నేటికీ సుభిక్షంగా ఉందని తెలిపారు. అటువంటి వారిలో సిక్కు గురువైనటువంటి గురు గోబింద్ సింగ్ ఒకరిని అన్నారు.1705లో ఔరంగజేబు సేనాధిపతి సేనాధిపతి మరియు సిరిహింద్ నవాబు అయిన వజీర్ ఖాన్ గురు గోవింద్ సింగ్ కుమారులైన ఆరు సంవత్సరాల ఫతేసింగ్ మరియు ఎనిమిది సంవత్సరాల జూరావర్ సింగ్ లను మహమ్మదీయ మతంలోకి మారమని కోరగా.. వారు నిరాకరించడం వల్ల వారిని సజీవంగా గోడలో పాతి పెట్టడం జరిగిందని అంతటి చిన్నతనంలోనే ఆ చిన్నారులు దేశభక్తిని కలిగి ఉండడం అభినందనీయమని అటువంటి మహానీయుల ఆదర్శాలను మనం పాటిస్తూ యువత భావితరాలకు అందించాలని కోరారు. అందుకే భారతదేశము ప్రపంచానికి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిన దేశమే కాకుండా ఆదర్శంగా ఉండగలుగుతుందని, ఇటువంటి భారత దేశంలో జన్మించడం మన అందరి అదృష్టమని అన్నారు. నాగరికత పేరుతో నేటి యువత విదేశీ అలవాట్లను పాటించడం శోచనీయమని, విద్యార్థులలో దేశభక్తి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని మానవీయ విలువలను పెంపొందించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అప్పుడే భారతదేశము ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ వాణి, డాక్టర్ సుమతి దేవి, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లిక, అధ్యాపకులు డాక్టర్ సుచిత్ర సింగ్, డాక్టర్ అనురాధ, డాక్టర్ అనిత ఇతర అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
తారా ప్రభుత్వ కళాశాలలో వీరబాల దివస్ కార్యక్రమం
Published On: December 28, 2024 9:03 pm
