వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 26, కామారెడ్డి :
కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామ రజక సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నేటి మహిళలు ముందుకు సాగాలని అన్నారు. అలాంటి ఐలమ్మ విగ్రహాన్ని ఇస్రోజీ వాడి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం అని, అందుకు ముందుకు వచ్చిన రజక సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, మహిపాల్, ప్రశాంత్, పోచయ్య, తిరుపతి, వెంకట్ రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.