సంగారెడ్డి ప్రతినిధి, మే 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ మహాత్మ గురు బసవేశ్వర అడుగుజాడల్లో నడవాలని వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు అన్నారు. ఆదివారం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో శ్రీ మహాత్మ గురు బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ మహాత్మ గురు బసవేశ్వర అడుగుజాడల్లో నడవాలని, గ్రామాలలో బసవేశ్వర విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీరశైవ నాయకులు రాజేశ్వర్ స్వామి, పోలీస్ ప్రవీణ్ పాటిల్, రామోజీ నవీన్, శరణయ్య స్వామి, నవీన్ కుమార్ పాటిల్ గ్రామ పెద్దలు సంగమేశ్వర్ పాటిల్, పరమేశ్వర్ పాటిల్, ప్రవీణ్ కుమార్, బసవ భక్తులు పాల్గొన్నారు.
శ్రీ మహాత్మ గురు బసవేశ్వర అడుగుజాడల్లో నడవాలి: వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు
Updated On: May 18, 2025 9:07 pm
