*గాంధారి పోలీస్ స్టేషన్ పరిధి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్*
ప్రశ్న ఆయుధం న్యూస్ 26 జనవరి కామారెడ్డి జిల్లా
గాంధారి మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి నెంబర్ ప్లేట్లు లేని వాహనాల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టగా, దాదాపు 30 ద్విచక్ర వాహనాలు ఎలాంటి నెంబర్ ప్లేట్లు లేకుండా అలాగే నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా ఉన్న వాహనాలు గాంధారి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అట్టి వాహనాలు సీజ్ చేయడమైనది. గాంధారి మండల పరిధిలో ఎక్కడైనా ,నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తిరిగినట్లయితే వాటిపై, ఫైన్ మరియు పూర్తిగా సీజ్ చేయబడును. ద్విచక్ర వాహనాలు దొంగతనం అవుతున్న నేపథ్యంలో, అలాగే గొలుసు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ప్రతి ఒక్క వాహనదారుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని అలాగే ప్రతి ఒక్క
ద్విచక్రవాహనుదారుడు హెల్మెట్లు ధరించాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు ట్రైనింగ్ ఎస్సై అరుణ్ కుమార్, గాంధారి సిబ్బంది పాల్గొన్నారు