సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): భక్తి భవంతో పాటు సేవా భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్య సాయిబాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సత్యసాయి బాబా 100వ జన్మ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… భగవాన్ సత్యసాయి బాబా తన భక్తులలో ఒకవైపు భక్తి భావాన్ని పెంపొందిస్తూ మరోవైపు అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించి కనిపించే దైవంగా గుర్తింపు పొందరని తెలిపారు. సత్య సాయి బాబా విద్య, వైద్య పరంగా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వంతో సమానంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం సత్య సాయి ట్రస్టు ద్వారా ఎన్నో వందల గ్రామాలకు తాగునీటి వసతిని కల్పించిన ఘనత సత్యసాయి బాబాకు చెందుతుందన్నారు. సత్యసాయిబాబా చూపిన భక్తి సేవా మార్గాలలో మనం నడవడమే ఆయనకు ఘన నివాళులు అని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, ఈడీఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి, సత్యసాయి సేవా సమితి నాయకులు,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తి భావంతో పాటు సేవ భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్యసాయిబాబా: అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్
Oplus_16908288