*- || ” వెంకయ్యనాయుడు ” కామెంట్స్ ||*
▪️రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారు.. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలను ప్రజలు ఇంటికి పంపారు.
▪️దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినవారు ఘోరంగా ఓడారు ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ లోనే ప్రజలు సమాధానం చెప్పారు.
▪️తుపాకీతో భయపెట్టాలని చూసినవారు ఆ తుపాకికే బలయ్యారు .. ఎన్నికలంటే ప్రజల్లోనూ మార్పు రావాలి.
▪️ఉచితమని ప్రకటన చేసే ప్రతి పార్టీని ప్రశ్నించాలి.. ఉచితం అనుచితానికి దారి తీస్తుంది.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది.
▪️ఎన్నికల్లో డబ్బు, కులం, ప్రాంతాలకే ప్రాధాన్యత పెరిగింది .. రాబోయే ఎన్నికల్లో అవేమీ ఉండకూడదు.
▪️ఓ పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్తే.. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలి.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమగ్రంగా మార్చాలి.
▪️దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నికకు సిఫార్సు చేస్తుంది.. ఒకేసారి ఎన్నికలు జరిగితే రూ.12 వేల కోట్లు ఆదా : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..