ఆలయ కమిటీ నియామక ఉత్తర్వులను అందజేసిన జువ్వాడి సోదరులు 

ఉత్తర్వులను
Headlines 
  1. జువ్వాడి సోదరుల చేతుల మీదుగా ఆలయ కమిటీ నియామక ఉత్తర్వులు
  2. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ బాధ్యతలు చేపట్టిన కటుకం రాజేశ్
  3. కాంగ్రెస్ నేతల సమక్షంలో వెంకటేశ్వర ఆలయ కమిటీకి నామినేషన్లు
  4. నూతన కమిటీ నియామకంపై కోర్ట్ల నియోజకవర్గంలో హర్షాతిరేకాలు
  5. వేంకటాపూర్ ఆలయ కమిటీ శాలువాతో సత్కరించిన జువ్వాడి నర్సింగరావు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నియామక ఉత్తర్వులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావులు నూతన కమిటీ చైర్మన్, డైరెక్టర్లకు శనివారం అందజేశారు. నూతన కమిటీలో చైర్మన్ గా కటుకం రాజేశ్ నేత, డైరెక్టర్లుగా పిట్టల రమేష్, ధ్యాగ రాజిరెడ్డి, పోతుగంటి రాజేశంగౌడ్, బర్కము గంగాలక్ష్మి నర్సయ్య, నుతిపల్లి మధు, గండ్ర వెంకట గోపాలరావులు ఉన్నారు. నూతన కమిటీని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కటుకం రాజేశ్ నేత, కాంగ్రెస్ నాయకులు విట్టల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిట్టి బాబు, ధ్యాగ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరుమండ్ల సత్యనారాయణ గౌడ్, బిసి సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్.నాగభూషణం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగంధుల రమేష్, మాజీ ఎంపిపి నేరెళ్ల దేవేందర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముహమ్మద్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment