*పాలకుర్తిలో బలగం సినిమా దర్శకుడు వేణు ఎల్దండి సందడి..*
తెలుగు చిత్రపరిశ్రమను ఉర్రూతలూగించిన బలగం సినిమా దర్శకుడు జబర్దస్త్ ఫేం వేణు ఎల్దండి ప్రస్తుతం నిర్మించబోయే నితిన్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నిర్మించబోయే ఎల్లమ్మ సినిమా లొకేషన్స్ కోసం పాలకుర్తి పరిసర గ్రామాలను పరిశీలించారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్యను ఆయన నివాసంలో సన్మానించి, ఆయనతో పాటు సింధు యక్షగాన కళాకారులతో నాటకాలు వేయించి, సెలక్షన్స్ నిర్వహించారు. సినిమాల పట్ల ఆకర్షణ ఉన్న,అనుభవం ఉన్న యువతి, యువకులకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాసేపు పాలకుర్తి చౌరస్తాలో ప్రజలతో ముచ్చటించారు. ఆయనతో పాటు రచయిత తిరుపతి (వకీల్ సాబ్) సినిమా బృందం, ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ మేడారపు సుధాకర్ లు పాల్గొన్నారు.