అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పశు వైద్య దావఖాన

*అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పశు వైద్య దావఖాన*

*పశువులు కూడా తలదించుకునేలా మనుషుల ప్రవర్తన*

*అధ్వానంగా ఆసుపత్రి ఆవరణ*

*పట్టించుకోని పశు వైద్యులు చోద్యం చూస్తున్న అధికారులు*

*జమ్మికుంట జులై 6 ప్రశ్న ఆయుధం*

కొంతమంది మనుషులు పశువుల దావఖాన ను కూడా వదలడం లేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా పశువుల దావఖాన ను వాడుకుంటూ దావఖాన ఆవరణను అధ్వానంగా తయారు చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పశు వైద్య దావఖాన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. రోజు రాత్రి అయితే తాగుబోతులకు అడ్డగా ఈ దావఖాన ఆవరణ ఉంటుంది. విశాలమైన వాతావరణం లో ప్రశాంతంగా ఉన్న ఈ దావఖాన పశువుల వైద్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయగా మనుషుల రూపంలో కొంతమంది పశువులు ఈ అడ్డాను అసాంఘిక కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ఈ దావఖానలో ప్రతిరోజు రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా మనుషులు చేరి విచ్చలవిడిగా మద్యం సేవించి బీరు బాటిల్లను సైతం పగలగొట్టి ఆ ప్రాంగణాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవైపు గేటు మూసి ఉన్నప్పటికీ లోపలికి మాత్రం పశువుల లాగా మనుషులు వెళ్లి దావఖానలో తాగుబోతులకు అడ్డంగా మార్చారు. ప్రతిరోజు ఉదయం ఒక పేపర్ బాయ్ తన పేపర్ను ఆసుపత్రి లోపల వేయాలంటే గేటు వేసి ఉంది లోపలికి వెళ్తే ఏమైనా అంటారేమో అని ఆ పేపర్ కు ఒక రబ్బర్ వేసి గేటు లోపల విసిరేస్తున్నారు. అలా విసిరేసిన పేపర్లు గత వారం రోజులుగా దానిని తీసిన వారు లేరు. కానీ కొంతమంది తాగుబోతులకు మాత్రం ఇది అడ్డ గా మారింది. వాళ్లు మాత్రం యదేచ్చగా ఆసుపత్రి లోపలికి వెళ్లి లోపల మద్యం సేవిస్తూ బర్త్డే పార్టీలు చేస్తూ తెల్లవారులు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అనంతరం వారు తిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు మొత్తం దావఖానా ప్రాంగణంలో వదిలేసి వెళుతున్నారు. పశువుల దావఖానకు ఆనుకొని ఒక దేవాలయం ఉంది కనీస విలువలు లేకుండా పశువుల వైద్యశాలను నాశనం చేస్తున్న వారిపై అధికారులు నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎదురుగా ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా చూసి చూడనట్టు ఉంటున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా పవిత్రమైనటువంటి పశువైద్యశాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చిన వారిని గుర్తించి పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment