పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు రాలేదా?: కేటీఆర్ ను నిలదీసిన విహెచ్.

IMG 20240819 WA0124

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఫైరయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయంలో పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ వల్లే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని వీహెచ్ అన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి యాదికి రాలేదు.. కానీ, అధికారం కోల్పోగానే గుర్తొచ్చిందా? అని దుయ్యబట్టారు. కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ సర్కార్.. సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతోపాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరును కూడా మారుస్తామన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఎంటీ సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనసు మార్చుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని.. లేకపోతే నాలుగేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాక దాన్ని సకల మర్యాదలతో తొలిగిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now