షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో అగ్నిప్రమాదం, కాలిపోయిన ఖరీదైన వస్తువులు, కట్టు బట్టలతో బాధితులు
ప్రశ్న ఆయుధం మే06: కూకట్‌పల్లి ప్రతినిధి
సర్క్యూట్ తో ఇంట్లో అగ్ని ప్రమాదం సంబంధించి ఖరీదైన వస్తువులు కాలిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో బ్లాక్ నెంబర్ 13 ప్లాట్ నెంబర్ 24 లో నివసించే వెంకన్న అమీనా దంపతులు ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. వెంకన్న కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండగా అమీనా కెపిహెచ్బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల 20 నిమిషాలకు కొడకండ్లకు వెళ్లాలని కుటుంబంతోపాటు అందరూ బయలుదేరి బస్టాండ్ కు వెళ్లారు. ఇంతలో సుమారు 6 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి అగ్నిప్రమాదం సంభవించి పొగలు బయటికి రావడంతో చుట్టుపక్కల వారు గమనించి బాధితులకు ఫోన్ చేయడంతో తిరిగి ఇంటికి చేరుకున్న బాధితులకు ఇంట్లో అగ్నిప్రమాదం సంబంధించి ఖరీదైన టీవీ బ్రిడ్జి వాషింగ్ మిషన్ తో పాటు కట్టుకునే బట్టలు కూడా కాలిపోవడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సొసైటీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్, ఎర్ర యాకన్న, పరుశురాములు, వెంకట్ లు సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇతర ఎన్జీవోల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుతున్నారు.