అమ్రాబాద్ మండలంలో డిసెంబరు ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు.
అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్, ఎల్మపల్లి అమ్రాబాద్, గ్రామాలలో డిసెంబర్ 1 నుండి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా కళాబృందంచే ప్రచార కార్యక్రమాలను గురువారం నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి గ్యారంటీల అమలు తీరుపై గ్రామాలలో జిల్లా అధికారుల ఆదేశం మేరకు నిర్వహిస్తున్నట్లు టీం కో-ఆర్డినేటర్ శివ, శివ నాగులు, భాస్కర్, బృందం ప్రచార కార్యక్రమంలో స్థానికులు జ్ఞానేశ్వర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.