పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

గుంతకల్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. ఇదొక్కటే అతని వ్యాపారం కాదు. కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు.

వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు. వీడియోలను విక్రయించి క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రతిఫలం పొందుతున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లా పాత పట్నంకు చెందిన గణేష్, జోత్న్సలు సహకరిస్తున్నట్లు గుర్తించి వారిని సైబర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈగిల్ వింగ్ ఐజి ఆకే రవిక్రిష్ణకు ముందస్తుగా రాబడిన సమాచారంతో ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను చేధించారు. ఎవరికి అనుమానం రాకుండా లూయిస్ రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనుల దర్వా లూయిస్ పదకొండు లక్షల రూపాయల వరకూ సంపాదించాడు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులిస్తామంటూ ప్రలోభ పెట్టి యువతి యువకులను ఆకర్షిస్తున్నాడు. ఆ తర్వాత వారితో పోర్న్ వీడియోలు రూపొందించడమే కాకుండా లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందు కోసం గుంతకల్‌లో ఏకంగా స్టూడియో సెట్ అప్ వేసినట్లు ఐజి ఆకే రవి క్రిష్ణ తెలిపారు.

సైప్రస్ దేశానికి చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారని తెలిపారు. యువతి, యువకులు అప్రమత్తంగా ఉండాలని ఐజి రవిక్రిష్ణ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment