సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 30 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరం
పార్వతిపురం : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు, టిడిపి సీనియర్ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర, పార్టీ అధినేత చంద్ర బాబు మార్గనిర్దేశకత్వాన్ని, ఆలోచనలను వారితో పంచుకున్నారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు కలుగుతున్న లాభాలను ప్రచారం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.