Headlines :
-
“వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిపై విజయమ్మ ఆగ్రహం”
-
“వైఎస్సార్ కుటుంబంపై అసత్యాలు – విజయమ్మ ఫైర్”
-
“షర్మిల, జగన్ ఆస్తులపై వివరణ ఇవ్వాలంటున్న విజయమ్మ”
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిపై విజయమ్మ మండిపడ్డారు. అసత్యాలు మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబ పరువు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ కొన్ని ఆస్తులు షర్మిల పేరుతో, కొన్ని ఆస్తులు జగన్ పేరుతో పెట్టారన్నారు. అది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదన్నారు. వైఎస్సార్ బతికి ఉండగా షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని జాబితా చదివారని పేర్కొన్నారు. జగన్ పేరుతో పెట్టిన ఆస్తుల జాబితాను కూడా సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చదవాల్సిందని విజయమ్మ అన్నారు.