మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి?
AP: ఇటీవల వైసీపీకి, రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్ననారని తెలుస్తోంది. బీజేపీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని సమాచారం.