గ్రామ పాలన అధికారులకు రేపటిలోగా విలేజ్‌ల అలాట్మెంట్

గ్రామ పాలన అధికారులకు రేపటిలోగా విలేజ్‌ల అలాట్మెంట్

 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8,కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని సూచించారు. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డు అప్లికేషన్లను ఆలస్యం చేయకుండా డిస్పోజ్ చేయాలని కూడా ఆదేశించారు.

గ్రామ పాలన అధికారులకు రేపటిలోగా విలేజ్‌ల అలాట్మెంట్ జరుగుతుందని, వారికి రేషన్ కార్డు వెరిఫికేషన్, భూ భారతి అప్లికేషన్ల పరిశీలన బాధ్యతలు అప్పగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now