అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని పట్టుకున్న గ్రామస్థులు…!
భిక్కనూర్ అక్టోబర్ 17.ప్రశ్న ఆయుధం
భిక్కనూర్ మండల పరిధి బస్వాపూర్ జాతీయ రహదారి 44 పై శుక్రవారం రోజున ఆవులను రవాణా చేస్తున్న లారీని స్థానికులు పట్టుకున్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని కొంతమంది యువకులు వెంబడించి లారీని ఆపి పరిశీలించగా సుమారు 53కి పైగా ఆవులు ఉన్నట్లు గుర్తించారు.అనంతరం ఎస్సై ఆంజనేయులు నేతృత్వంలో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.ఎవరైనా అక్రమంగా ఆవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.