మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 22 ప్రశ్న ఆయుధం న్యూస్:
కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభను గ్రామస్థులు బహిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదంటూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామా గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు