Site icon PRASHNA AYUDHAM

భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్రమ అరెస్టులు: లఘుచర్ల గ్రామస్తులు

IMG 20241118 WA0125

*భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్రమ అరెస్టులు: లఘుచర్ల గ్రామస్తులు*

న్యూ ఢిల్లీ: వికారాబాద్ లగచర్ల ఘటనపై బాధిత రైతు కుటుంబాలు ఇవాళ ఢిల్లీకి చేరుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు వివరించారు. మా ప్రాణం పోయినా మేము ప్రభుత్వానికి భూములు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు.

*పార్మా కంపెనీ ఏర్పాటు* కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లగచర్ల బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలబడింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్‌ తుల ఉమ, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు వెళ్లారు.

Exit mobile version