బిసి భవన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కి వినతి :సాకేనరేష్

*బిసి భవన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కి వినతి :సాకేనరేష్*

అనంతపురం :డిసెంబర్

నగరంలో బిసి భవన్ ఏర్పాటు చేయాలని బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకేనరేష్ ఆధ్వర్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి తన కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా సాకేనరేష్ మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు బిసి భవన్ లేదని దీని ద్వారా అనేక ప్రాంతాలనుంచి వస్తున్న బీసీలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసారు, ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థలాన్ని పరిశీలిస్తున్నామని తొందరలో బిసి భవన్ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి, బిసి నాయకుడు డి. కె. రామలింగ, శ్రీనివాసులు, మనోజ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now