యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం.

●ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి, వారి కుమారులు.

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 51 సంవత్సరాలుగా నెలకొల్పుతున్నటువంటి వినాయక నిమర్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, అయోధ్య పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు దొంతి చంద్ర గౌడ్, వాకిటి హనుమంత రెడ్డి, వాకిటి బిక్షపతి రెడ్డి, ముత్యం రెడ్డి,వెంకట్ రెడ్డి, భాషా గౌడ్, సురేష్ గౌడ్, కృష్ణ గౌడ్, శివలింగం గౌడ్, కుంట లక్ష్మణ్, ఆంజనేయులు గౌడ్,మునూరి అంజయ్య, కుంట అంజయ్య, వాకిటి సత్తిరెడ్డి, ఖదీర్, రాకేష్ రెడ్డి, ఇక్కిరి శ్రీశైలం, నరసింహారెడ్డి,మరియు యువకులు, యువ నాయకులు, మరియు శ్రీ స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి స్నేహితులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యూత్ సభ్యులు భారీ ఏర్పాట్లను చేశారు.

Join WhatsApp

Join Now