ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 19, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల శివాజీ యువసేన గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో హోరాహోరీగా పోటీపడి ఉప్పు సత్యనారాయణ 36,911/- రూపాయలకు శివాజీ యువసేన వారి వినాయకుడి లడ్డూని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వివిధ యువజన సంఘాల ప్రతినిధులు అదేవిధంగా శివాజీ యువసేన సభ్యులు అశృత్ గౌడ్, రోహన్ రెడ్డి, కోమల్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, సుజిత్ రెడ్డి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.