మునిపల్లి ఆరోగ్య కేంద్రంలో నూతన వెయిటింగ్ హాల్ ప్రారంభం: డెక్కన్ టోల్‌వేస్ రీజినల్ హెడ్ వినీష్ కుమార్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని ఎన్ హెచ్-65 మార్గాన్ని నిర్వహిస్తున్న డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఓపిడి వెయిటింగ్ హాల్‌ను సోమవారం డెక్కన్ టోల్‌వేస్ రీజినల్ హెడ్ వినీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వినీష్ కుమార్ మాట్లాడుతూ.. రోగుల సంరక్షణను మెరుగు పరచడం, ఆసుపత్రి సేవల అనుభవాన్ని అభివృద్ధి చేయడం మా ముఖ్య లక్ష్యం అని తెలిపారు. వర్షాలు లేదా ఎండలలో వైద్యుల సలహాల కోసం వేచి చూడాల్సిన రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడానికి ఈ హాల్‌ను విశాలంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ టోల్‌వేస్ ప్రాజెక్ట్ హెడ్ రాజేష్, మునిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్యా రాణి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now