గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన వినోద్..

గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన వినోద్..

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ జ్యోతి అనే పేషంట్ కి తక్కువ మందిలో ఉండే బి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన కామారెడ్డి కీ చెందిన యువకుడు వినోద్ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ.
రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు.మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన ప్రాణం రక్షించబడుతుంది
యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది. ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన వినోద్ కి జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now