మహిళల పై అత్యాచారాలను, హింసను అరికట్టాలి

ఐద్వా జిల్లా కమిటీ కొవొత్తుల ర్యాలీ

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా గురువారం ఖమ్మంలో మహిళలపై హింస అత్యాచారాలకు, పాల్పడుతున్న నరకాసురుల్ని శిక్షించాలని కోరుతూ ఖమ్మం సుందరయ్య భవన్ నుండి గట్టాయసెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెరుగు రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి
బండి పద్మ , మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలపై హింస, అత్యాచారాలు , పెరిగాయని ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో బిజెపి పరిపాలించే రాష్ట్రాల్లో అత్యాచారాలు, హింస ,జరుగుతున్నాయని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు , చిత్తశుద్ధితో పనిచేయటం లేదని అన్నారు .సమాజంలో డ్రగ్స్, మత్తుపదార్థాలు, మద్యపానం, ఆదాయ వనరులుగా భావిస్తున్న ప్రభుత్వాలు వాటి అరికట్టడంలో చిత్తశుద్ధి లేదన్నారు. వీటి వల్లనే మహిలలపై అత్యాచారాలు హింస పెరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో విధినిర్వహణలో ఉన్న ప్రాణాలు పోసే మహిళా డాక్టర్ను అత్యంత పాశవికంగా హింసించి ,అత్యాచారం, చేసి హత్య చేసిన దుండగులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపాడడం అత్యంత హేయమైన చర్యని మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి చర్యలు తీసుకుపోవడం దారుణం అన్నారు. తక్షణం అత్యాచారానికి పాల్పడ్డ దోషులందరినీ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని మహిళా సాధికారితకు,చట్టసభల్లో చేసిన 33 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే ‌అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో మత్తు పానీయాలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. బెంగాల్లో డాక్టర్ల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు.మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకురాలు, పి నాగ సులోచన ,ఎం‌‌ డి ,మెహరునీసా బేగం ,కె అమరావతీ ,భాగం అజిత, ఎస్ కే బీబీ, ‌కుమారి, మంగ , నందిపాటి పావని, సునీత, అమీనా, ఈశ్వరి ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now