బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్

*బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విపుల్ జైన్*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేసిన స్టేట్ కౌన్సిల్ సభ్యుల జాబితాలో

కామారెడ్డి పట్టణానికి చెందిన విపుల్ జైన్ కి చోటు దక్కింది.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విపుల్ జైన్ గతంలో బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షునిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నియామకానికి సహకరించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ విస్తరణకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment