“ఆర్టీఐ వేసిన వారిని తోలు తీస్తాం ” విరహత్ అలీ

“ఆర్టీఐ వేసిన వారిని తోలు తీస్తాం ” విరహత్ అలీ

“సీఎం రేవంత్ రెడ్డి పేరు” వాడుకుంటూ ఆర్టీఐ దరఖాస్తుదారుల పై బెదిరింపులు..!

సీఎం రేవంత్ పేరు వాడుకుంటూ బెదిరింపులు – మీడియా ముసుగులో మాఫియా రాజ్యం..?

జర్నలిస్టు యూనియన్ నేత విరహత్ అలీపై దుర్వినియోగ ఆరోపణలు..!

ఆర్టీఐ చట్టం ప్రజల హక్కు, కానీ బెదిరింపుల ఆయుధంగా మారుతోంది..!

గత ప్రభుత్వంలో మంత్రుల పేరుతో లావాదేవీలు చేసినవారే ఇప్పుడు రేవంత్ ఆశ్రయం…?

“ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది..?” అంటూ ప్రజల ఆవేదన..!

హైదరాబాద్‌ ప్రతినిధి

ఆర్టీఐ చట్టం — ప్రజల హక్కుల రక్షణకు, ప్రభుత్వ పారదర్శకతకు పునాది. కానీ ఇప్పుడు అదే చట్టం కొందరికి “లాభదాయక బెదిరింపు పత్రం”గా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో జర్నలిస్టుల యూనియన్ పేరుతో కొంతమంది వ్యక్తులు అధికారులపై, సామాన్యులపై బెదిరింపులకు దిగుతున్నారని సమాచారం. ముఖ్యంగా, “సీఎం రేవంత్ రెడ్డి పేరు” చెప్పి ఆర్టీఐ వేసిన వారిని “తోలు తీస్తాం” అంటూ హెచ్చరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ బెదిరింపుల వెనుక జర్నలిస్టు యూనియన్ నేత విరహత్ అలీ పేరు ప్రస్తావనలోకి వచ్చింది.

“ఆర్టీఐ పెడితే రేవంత్ తోలు తీస్తాడు” అంటూ భయపెట్టడం ప్రభుత్వ నిబంధనలను మాత్రమే కాకుండా ఆర్టీఐ చట్టం, ప్రజా హక్కులపై కూడా దాడిగా పరిగణించబడుతోంది.

ఇంటర్నల్ సర్కిల్స్‌లో ఈ వ్యవహారం సీఎం దృష్టికి వచ్చిందా? లేదా తెలియకుండా జరుగుతోందా? అనేది ప్రశ్నార్థకం.

ఇక యూట్యూబ్‌ చానళ్లలో “సీఎం కోపంగా ఉన్నారు”, “రేవంత్ ఆదేశాలు ఇచ్చారు” అంటూ నిజం, అబద్ధం కలగలిపిన ప్రచారం సాగుతోంది. దీని వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.

విరహత్ అలీ జర్నలిస్టు యూనియన్ పదవిని దుర్వినియోగం చేస్తూ, “సీఎం వెనక మనమే ఉన్నాం” అంటూ అధికారం ప్రదర్శిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో మంత్రుల పేరుతో నకిలీ లావాదేవీలు చేసిన కొందరు ఇప్పుడు “రేవంత్ ఆశ్రయం” పొందుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

“ఇంటలిజెన్స్ నిఘా విభాగం ఏం చేస్తోంది?” అని ప్రజల ప్రశ్న.

పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. అయితే ఆయన పేరుతోనే కొందరు జర్నలిస్టులు, యూనియన్ నాయకులు ప్రజలను, అధికారులను బెదిరించడం — ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చే చర్యగానే భావిస్తున్నారు.

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే, మీడియా నైతిక విలువలను పాదదులిపే ఈ *“మీడియా మాఫియా”*పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే,

“రేవంత్ పాలన కూడా పాత ప్రభుత్వాల దారిలో నడుస్తుందా?” అన్న అనుమానం ప్రజల్లో పెరుగుతోంది.

పాలనా వ్యవస్థపై, ప్రజాస్వామ్య విలువలపై ఈ విధమైన దుర్వినియోగం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయ వర్గాలు సూచిస్తున్నాయి.

సీఎం పేరుతో బెదిరింపులు చేసే గుంపుపై ప్రభుత్వం ఎప్పుడు కత్తి దింపుతుందో ప్రజల దృష్టి ఇప్పుడు అక్కడే నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment