విజయవంతంగా విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర.

విజయవంతంగా విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర.

ప్రశ్న ఆహుధం,జులై 28 శేరిలింగంపల్లి,ప్రతినిధి

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ చైతన్య యాత్ర పేరుతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం దగ్గర నుండి శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, కందిమల్లాయపల్లె, ఆంధ్ర ప్రదేశ్ వరకు 450 కిలోమీటర్లు పాదయాత్ర విజయవంతంగా జరిగిందనీ సంఘం సభ్యులు తెలిపారు. ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగన్మాత ఈశ్వరీ దేవి మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర శివకుమార స్వాములవారు, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మధుసూదనా చారి, హైదరాబాద్ ఏసిపి కె కిరణ్ కుమార్, బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు కొండముది బంగారు బాబు లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,అఖిలభారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌలె జగన్నాధం, మధుచారి లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ విశ్వకర్మలు అందరం ఐకమత్యంగా ఉండాలని, మన ఐక్యతే మనకు బలమని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధ్యక్షుడు పుష్పగిరి ని మరియు పాదయాత్ర చేసిన వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపి, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో ఎందరో విశ్వకర్మలు పాల్గొన్నట్లు ఆయన తెలిపాడు.

Join WhatsApp

Join Now