*శ్రామికుల గౌరవాన్ని చాటిన విశ్వకర్మ జయంతి: నాగారంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో వేడుకలు*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని, భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ కార్యాలయంలో పూజలు, జెండా ఎగరవేత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుక శ్రామిక శక్తి, సంఘీభావం, మరియు రాజకీయ ఉత్సాహంతో కళకళలాడింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, “కార్మికులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. విశ్వకర్మ జయంతి కూలీల గౌరవాన్ని, శ్రామికుల సమర్థతను గుర్తు చేస్తుంది. శ్రామిక హక్కుల కోసం పోరాటం మరింత బలోపేతం కావాలి” అని సందేశమిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు రాములు, మాజీ జడ్పీటీసీ సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, రామక్కపేట రవీందర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్ రెడ్డి, సదానందం, పురుషోత్తంతో పాటు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.